3 వ తరగతి తెలుగు DSC నోట్స్
1. వాన దేవుడా
- ఇతివృత్తం : పర్యావరణం
- ప్రక్రియ :గేయం
- నోట్: “పగలనక రేయనక శ్రమించి పసిడి పంటలు పండించే రైతన్నలు సుఖపడితేనే దేశం మొత్తం సుఖంగా ఉన్నట్లు” – సర్దార్ వల్లభాయ్ పటేల్
2. బాల భీముడు
*ఇతివృత్తం :ఇతిహాసం
*ప్రక్రియ: కథ
“అయ్యో నా చిట్టి తండ్రికి ఏమైందో అనే వాక్యంలో ‘అయ్యో’ అనేది అవ్యయం
- “ముక్కున వేలేసుకోవడం” —. జాతీయం
- “పంచ పాండవులు” — ద్విగు సమాసం
- “భీముడు చెట్టు మొదలు పట్టుకొని ఊపగా కౌరవులు అందరూ పనుల జలజల కింద పడ్డారు.” — ఉపమాలంకారం.
3.అమ్మ
కవి: వేముగంటి నరసింహాచార్యులు
- ఇతివృత్తం :సంస్కృతి /విలువలు
- ప్రక్రియ: గేయం
- వేముగంటి నరసింహాచార్యులు రాసిన ’బాలగేయాలు’ నుండి తీసుకున్నారు.
- అల్పప్రాణాక్షరాలు
- మహా ప్రాణాక్షరాలు వర్గయుక్కులు
@ దయ:
- ఇతివృత్తం: భూత దయ
- ప్రక్రియ: కథ
4. మన పండుగలు
- ఇతివృత్తం: సంస్కృతి
- ప్రక్రియ: సంభాషణ
- చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగ జరుపుకుంటారు.
- చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరామనవమి (శ్రీరామ జన్మదినం).
- బోనాల రోజున అమ్మవారికి నైవేద్యం సమర్పించడాన్ని ’ఊరడి’ అంటారు. ఇది ఆషాడ మాసంలో జరుపుకుంటారు.
- శ్రావణ శుద్ధ పౌర్ణమి రోజున ’ఏరువాక పున్నమి’ సాగుబాటు పండగ, పంట ఇంటికొచ్చాక – కొత్త పండుగ.
- భాద్రపాద మాసంలో శుద్ధ చతుర్థి నాడు వినాయక చవితి జరుపుకుంటాం.వినాయకుడి వాహనం — అనింద్యుడు (ఎలుక).
- ఆశ్వయుజ మాసం శుద్ధ దశమి — దసరా. దసరాకు 20 రోజుల తర్వాత అశ్వయుజ బహుళ అమావాస్య రోజున దీపావళి జరుపుకుంటాం.
- పెత్ర అమావాస్య రోజున ఎంగిలిపూవులు బతుకమ్మను (మొదటి రోజు) జరుపుకుంటారు.
- తీజ్ పండగ సిత్లా భవాని కి (లంబాడీ దేవత) పూజలు చేస్తారు. తీగలతో అల్లిన బుట్టలో తండా నాయకునితో పుట్టమన్ను పోయించి వాటిలో నానబెట్టిన గోధుమలు చల్లుతారు.
- బొడ్డెమ్మ పండగలో ’వెంపలి చెట్టు’ను పెడతారు.
5. కాకుల లెక్క
ఇతివృత్తం :హాస్యం
ప్రక్రియ :కథ
- “6803 కాకులు ఉన్నాయి” – బీర్బల్
6 .లేగ దూడ
ఇతివృత్తం: భూత దయ
ప్రక్రియ: గేయం
7 . నీటి అందాలు
ఇతివృత్తం: దర్శనీయ స్థలాలు
ప్రక్రియ: వ్యాసం
లక్నవరం :
- జయశంకర్ జిల్లాలోని ములుగు మండలానికి దగ్గరలో మరియు హైదరాబాద్ కి 212km మరియు వరంగల్ కు 75km. ఇక్కడ 13 ద్వీపాలు ఉన్నాయి
- దీన్ని ఆ 13 ద్వీపాలలో 3 ద్వీపాలను కలుపుతూ వంతెన (కాకతీయులు తవ్వించి) కట్టించారు
- దీన్ని కాకతీయ సేనాని రేచర్ల రుద్రుడు కట్టించాడు
- రామప్ప దేవాలయం ఈ దేవాలయంలో రామలింగేశ్వర స్వామి ఉత్సవ దైవంగా మరియు ప్రధాన దైవంగా శివుడు ఉంటాడు
- ఈ దేవాలయాన్ని గణపతి దేవుని కాలంలో రేచర్ల రుద్రుడు నిర్మించారు
- 2021 జూలై 25న ప్రపంచ వారసత్వ హోదా దక్కింది.
- కుంతల జలపాతం:
- ఆదిలాబాద్ ను తెలంగాణ కాశ్మీర్ గా భావిస్తారు. మన రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతంగా పేరుపొందిన కుంతల జలపాతం నిర్మల్ జిల్లాలో ఉంది.
- ఇది కడెం నదిపై ఉన్నది. దీని ఎత్తు దాదాపు 145 అడుగులు (45 మీటర్లు).
నాగర్జున సాగర్ ప్రాజెక్టు:
- ప్రపంచంలోనే ఎత్తైన రాతి కట్టడం. దీన్ని నల్గొండ జిల్లాలో కృష్ణా నదిపై నిర్మించారు.
- 1955 లో భారత తొలి ప్రధాని అయిన జవహర్ లాల్నె నెహ్రూ దీన్ని శంకుస్థాపన చేశారు.
- ఆచార్య నాగార్జునడు ఇక్కడ నివసించాడని చెప్తారు.
- ఈ ప్రాంతాన్ని ఇక్ష్వాకుల పరిపాలన కాలంలో ’విజయపురి’ అని పేరుతో పాలించారు.
- అక్కడి నుండి పది కిలోమీటర్ల దూరంలో ’అనుపు’ అనే ప్రదేశంలో బౌద్ధమతానికి చెందిన నాగార్జునుడు విశ్వవిద్యాలయాన్ని నిర్మించారు.
- భారతదేశంలో రెండవ అతిపెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్టు నాగార్జునసాగర్ ప్రాజెక్టు.
- మరి మొదటి బాలార్ధక సాధక ప్రాజెక్టు బాక్రానంగల్ హిమాచల్ ప్రదేశ్ లోని సత్లేజ్ నదిపై ఉంది.
8. మతిమరుపు ఈగ.
- ఇతివృత్తం — హాస్యం
- ప్రక్రియ — కథ
- మొట్టమొదట ఈగ తన పేరు మరిచపోయి లేక దూడను అడిగింది.
- బేలగా అనగా అర్థం అమాయకత్వం.
- ఈగకి తన పేరు గుర్తు చేసింది గుర్రం కడుపులోని తన పిల్ల.
- లేగ దూడ >ఆవు> ఆవును మేపే మల్లన్న >చెట్టు> చెట్టు నీడలో పడుకున్న గుర్రం >గుర్రం కడుపులోని పిల్ల.
9. ఏమేమి చూడాలి?
- ఇతివృత్తం — ప్రకృతి పరిశీలన
- ప్రక్రియ — గేయం
10. వేమన శతకం
- ఇతి వృత్తం — సంస్కృతి
- ప్రక్రియ — వ్యాస
అ) రాష్ట్ర జంతువు — జింక (బోలాతనానికి, అమాయకత్వానికి గుర్తు)
ఆ) రాష్ట్ర పక్షి — పాలపిట్ట (స్వేచ్ఛకు గుర్తు)
ఇ) రాష్ట్ర వృక్షం — జమ్మి చెట్టు (బంగారం అంటారు) (విజయానికి గుర్తు)
ఈ) రాష్ట్ర పుష్పం — తంగేడు పువ్వు
- మన తెలంగాణ రాష్ట్రం జూన్ 2 2014 రోజున భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది.
12. తోట తల్లి:
కవి; సి.నా. రే
- ఇతివృత్తం — పర్యావరణం
- ప్రక్రియ — గేయ
13. గాంధీ
- గాంధీ పుట్టింది 1869 అక్టోబర్ 2 గుజరాత్ లోని పోరుబందర్ లో. తండ్రి కరంచంద్ గాంధీ ,తల్లి పుత్లి బాయ్.
- శ్రవణ కుమారుని నాటకం అనే పుస్తకం తండ్రి ఇచ్చాడు.
- హరిచంద్ర నాటకం చూసి ప్రభావితుడు అయ్యాడు.
14. చెట్టు కోరిక
- ఇతివృత్తం — సృజనాత్మకత
- ప్రక్రియ — కథ
- సన్నని కొమ్మల మధ్యలో నుండి దూరడం అంటే గాలికి ఇష్టం
- అయ్యో అయ్యో సాయం చేయండి పోలీసు కోతులు
- అయ్యయ్యో ఎవరైనా కాపాడండి కూలీలు చీమలు
- అమ్మో మంట అమ్మో బాధ అనుకుంటూ ఏడ్చింది మంటలు పక్షులు.
అదనపు సమాచారం:
తెలుగు సంవత్సరాలు
మొత్తం 60 సంవత్సరాలు అందులో
- మొదటిది ప్రభావ
- చివరిది అక్షయ
- గత సంవత్సరం క్రోధి నామ
- ప్రస్తుత సంవత్సరం విశ్వా వసు
- రాబోయే సంవత్సరం పరాభవ
పాండవులు మరియు వారి పుట్టుక అంశ:
- ధర్మరాజు — యమధర్మరాజు
- భీముడు — వాయుదేవుడు
- అర్జునుడు — ఇంద్రుడు
- నకుల, సహదేవులు — అశ్విని దేవతలు
తెలుగు మాసాలు :
- చైత్రమాసం — ( ఉగాది ,శ్రీరామనవమి)
- వైశాఖమాసం
- జేష్ఠ మాసం
- ఆషాడ మాసం — ( బోనాలు)
- శ్రావణమాసం — ( ఏరువాక పండగ)
- భాద్రపద మాసం — ( వినాయక చవితి)
- అశ్వయుజ మాసం — ( బతుకమ్మ ,దసరా ,దీపావళి)
- కార్తీక మాసం
- మార్గశిర మాసం
- పుష్య మాసం — ( సంక్రాంతి)
- మాఘమాసం — ( శివరాత్రి ,రథసప్తమి)
- పాల్గొనమాసం — ( హోలీ)